తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​లోనూ రోడ్లపైకి భారీగా వాహనాలు

రాష్ట్రవ్యాప్తంగా జోన్లవారీగా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో.. రోడ్లపైకి వాహనదారులు ఇష్టారాజ్యంగా వస్తున్నారు. సర్కారు మినహాయింపులతో... ఆయా రంగాలకు చెందిన ప్రజలు బయటికి వస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతుండటంతో సంబంధిత వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. దాదాపు 40శాతం వాహనాలు రహదారులపైకి వచ్చాయి. జిల్లాల్లో సరి బేసి విధానంలో దుకాణాలు తెరుస్తున్నారు.

lock down continue in telangana
lock down continue in telangana

By

Published : May 9, 2020, 11:53 AM IST

lock down continue in telangana

హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడున్నాయి. ప్రస్తుతం సుమారు 40 శాతం వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నాయి. లాక్‌డౌన్ మొదటి రోజు నుంచి కూడళ్ల వద్ద సిగ్నళ్ల వ్యవస్థను నిలిపేసిన ట్రాఫిక్ పోలీసులు... ప్రమాదాల నివారణ జాగ్రత్తగా శుక్రవారం నుంచి వాటిని ఆన్ చేశారు. అకారణంగా బయటికొచ్చే వాహనదారులకు జరిమానా విధించడం లేదా వాహనాల జప్తు చేసే ప్రక్రియ కొనసాగిస్తూన్నారు. హైదరాబాద్‌లో రాత్రి 9 తర్వాత ప్రజలు వాహనాలపై సాధారణంగా తిరుగుతుండటం గమనార్హం.

జరిమానాలు విధిస్తున్నారు

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు సరి బేసి విధానంలో దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. మాస్కులు వాడకం, సామాజిక దూరం పాటించని 46 దుకాణాలకు కలిపి లక్షా 52వేల జరిమానా విధించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. రాత్రి 7గంటల తర్వాత రోడ్లపైకి అకారణంగా వచ్చిన వాహనదారులను సంగారెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో దుకాణాలు, ప్రైవేటు ఆస్పత్రుల దగ్గర జనం భారీగా కనిపించారు.

అజయ్ కుమార్ సమీక్ష

ఖమ్మంలో లాక్ డౌన్ సడలింపుల తర్వాత పరిస్థితిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా సమీక్షించారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. కరీంనగర్‌లో 20 రోజులుగా కొత్తకేసులు నమోదు కాకపోవడం వల్ల కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఏ కేటగిరిలోని షాపులను తెరిచేందుకు అనుమతిస్తున్నారు. దుకాణాలు తెరిచినా వీధులు మాత్రం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

దుకాణాలను పరిశీలించిన కలెక్టర్‌ నిఖిల

వరంగల్ ఉమ్మడి జిల్లాలో లాక్‌డౌన్ సడలింపుల ఫలితంగా క్రమంగా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. గ్రీన్ జోన్‌లో ఉన్న వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు తెరుచుకున్నాయి. జనగామలో సరి బేసి విధానంలో తెరుచుకున్న దుకాణాలను జిల్లా కలెక్టర్‌ నిఖిల పరిశీలించారు. ఏపీతో సరిహద్దులు గల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెక్ పోస్టుల వద్ద పాస్‌లు ఉన్నవారిని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని రామాపురం చెక్‌పోస్టు మీదుగా ఇటు నుంచి అటు 6 వందల మందిని.. అటు నుంచి ఇటు 470 మందిని తరలించారు. సూర్యాపేట జిల్లాలో ఆరున్నర వేల మందిని హోం క్వారంటైన్ చేసిన అధికారులు... ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అన్ని కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో... ఆరోగ్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నాయి.

ఇదీ చూడండి :భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ABOUT THE AUTHOR

...view details