huge applications for excise liqour shops మద్యంషాపులకు దరఖాస్తుల వెల్లువ.. ప్రభుత్వ ఖాజానాకు కాసుల గలగల Liquor Shops Tenders Telangana 2023 :మద్యం దుకాణాల ద్వారా భారీగా ఆదాయాన్ని పొందొచ్చని భావిస్తున్న వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఒక్కసారే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకపోవడం, విడతల వారీగా లైసెన్స్ ఫీజుల చెల్లింపులకు అవకాశం ఉండడంతో ఆర్థికంగా స్థోమత లేని వారు సైతం దుకాణాలు దక్కించుకోవడానికి చొరవ చూపుతున్నారు.
Huge Response to Liquor Shops Tenders Telangana 2023 : 2011 జనాభా ఆధారంగా ఆరు స్లాబుల్లో లైసెన్స్ ఫీజును అబ్కారీ శాఖ నిర్దేశించింది. ఐదు వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో యాభై లక్షలు ఉండగా.. 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాలల్లో లైసెన్స్(Wine Shop License) ఫీజు అత్యధికంగా కోటి పది లక్షలుగా ఉంది. జనాభా సాంద్రతను బట్టి.. ఈ స్లాబులు వర్తించేట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది.
మందు బాబులా మజాకా.. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు కిక్కే కిక్కు
Wine Shop License Applications Telangana :లాటరీ ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకోడానికి పోటీ పడే వారి సంఖ్య తగ్గించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల రుసుం కింద రెండు లక్షలు నిర్దేశించింది. ఈ మొత్తం తిరిగి ఇచ్చేది ఉండదు. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకోడానికి సర్కారు వెసులుబాటు కల్పించింది. అయితే దరఖాస్తు రుసుం రెండు లక్షలు పెట్టినా.. పోటీ పడే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
మద్యం షాపు తొలగించాలని ప్రధానికి లేఖ
Telangana Liquor Shop Tenders Notification 2023 : రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం అబ్కారీ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 4వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీ వరకు కొనసాగనుంది. 21వ తేదీన వేలంపాట ద్వారా దుకాణాల ఎంపిక ఉంటుంది. నిన్నటి వరకు 15వేల 4వందల నాలుగు దరఖాస్తులు రాగా.. నిన్న ఒక్కరోజే 8వేల 491 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది.
Telangana Liquor Policy 2023 : శంషాబాద్ పరిధిలో అత్యధిక లాభాలు ఉంటాయన్న అంచనాతో మద్యం వ్యాపారులు దుకాణాల(Liquor Shop Tender 2023) కోసం పోటీ పడుతున్నారు. అయితే శంషాబాద్ పరిధిలో దుకాణం దక్కించుకున్న వారు కోటి పది లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ఫీజుకు దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముకోడానికి అవకాశం ఉంటుంది.
దీనిపై 20శాతం.. అంటే 2 కోట్ల 20 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో లైసెన్స్ ఫీజు, దుకాణ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు మొత్తం కలిపితే కోటి 50 లక్షల నుంచి కోటి 60 లక్షల వరకు పోయినా.. 60 నుంచి 70 లక్షలు వరకు లైసెన్స్‌దారుడికి ఆదాయం సమకూరుతుంది. అందువల్లే శంషాబాద్ ఆబ్కారీ జిల్లా పరిధిలో డిమాండ్ అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Action Illegal Liquor in TS : 'ఇతర రాష్ట్రాల మద్యం తెస్తే ఊరుకునే ప్రసక్తే లేదు'
SI Video Viral in Rajanna Sircilla : మద్యం బాటిల్తో ఎస్సై వీడియో.. సోషల్ మీడియాలో వైరల్