తెలంగాణ

telangana

ETV Bharat / state

Liquor Sale Record: తెగ తాగేశారు.. గ్రేటర్​లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు - telangana news

liquor sale record: చలి తీవ్రత అధికమవుతోంది... ఈ నేపథ్యంలో మద్యం సేవించేందుకు మందుబాబులు మద్యం దుకాణాల ముందు క్యూ కడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ నెలలో తొలి 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఏకంగా 250 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Liquor Sale Record:  తెగ తాగేశారు.. గ్రేటర్​లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
Liquor Sale Record: తెగ తాగేశారు.. గ్రేటర్​లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

By

Published : Dec 6, 2021, 3:04 AM IST

liquor sale record: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఈనెల తొలి 5రోజుల్లోనే.... 250కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. అక్టోబరు, నవంబరు నెలల్లో రోజుకు సుమారుగా 30 నుంచి 34 కోట్లుఅమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం రోజుకు 50 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నట్టు అంచనా. గత ఏడాదితో పోల్చితే బీర్లు 30 శాతం, దేశీయ మద్యం 20 శాతం విక్రయాలు పెరిగాయి. కొన్ని దుకాణాల్లో సాయంత్రానికే సరుకు అయిపోతున్నట్టు సమాచారం.

మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు పెంచారు. నగరంలో నవంబరులో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 4470 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 1527 మందిపై ఛార్జ్‌షీటు నమోదు చేసి న్యాయస్థానాల్లో హాజరుపరిచారు. 1480 మందికి 1,55,44,200 రూపాయల జరిమానా, నలుగురి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేశారు. ఇద్దరికి 12 రోజులు, 24 మందికి 7 రోజులు, 21 మందికి 5 రోజులు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరందరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన 2943 మందిపై ఛార్జ్‌షీటు దాఖలు చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

ABOUT THE AUTHOR

...view details