తెలంగాణలో వారంరోజులుగా కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మరింత ప్రమాదకరంగా మారింది. కోవిడ్ నివారణ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకే కాకుండా తాజాగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వైరస్ సోకుతోంది. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఏకంగా రూ.2,226 కోట్లు..
గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ప్రకటిస్తే ఏలా ఉంటుందోనని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు. లాక్‌డౌన్ విధించాలని వైద్య శాఖ అధికారులు కోరడం వల్ల ఏ క్షణానైనా లాక్‌డౌన్ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసి దాస్తున్నారు. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల ద్వారా... 29 రోజులకు ఏకంగా రూ.2,226 కోట్లు విలువైన 26.29లక్షల కేసుల లిక్కర్, 27.30లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది.