తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ సంచాలకులు తెలిపారు. ఎల్లుండి సైతం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

By

Published : Aug 24, 2020, 2:26 PM IST

Light to moderate rains for two days in the telangana state
రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

బంగ్లాదేశ్​ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వలన ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ... నైరుతి దిశకు వంపు తిరిగి ఉంది. రాగల రెండు రోజుల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.

ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి.. దక్షిణ కోస్తా తమిళనాడు వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 1.5 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది.

దీనితో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్​ వాతావరణ సంచాలకులు తెలిపారు.

ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ

ABOUT THE AUTHOR

...view details