తెలంగాణపై తౌక్టే తుఫాను ప్రభావం తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం ఒకటి, రెండు ప్రదేశాల్లో పడే అవకాశమున్నట్లు ప్రకటించింది.
రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు - తౌక్టే తుఫాన్ వార్తలు
తౌక్టే తుఫాను ప్రభావం తెలంగాణపై తగ్గిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో బలమైన కిందిస్థాయి దక్షిణ గాలుల ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
తౌక్టే తుఫాను గంటకు 15కి.మీ వేగంతో ప్రయాణిస్తూ బలపడి ఈరోజు ఉదయం 8:30 నిమిషాలకు ముంబయికి పశ్చిమ దిశగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి... తన తీవ్రత తగ్గించుకొని అతి తీవ్ర తుఫానుగా మారి ఈరోజు సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య గుజరాత్ తీరాన్ని చేరుకొని పోరుబందర్-మహువాల మధ్య ఈరోజు రాత్రి 8:30 నుంచి 11:30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి:రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు సుప్రీం ఆదేశం