మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా వరద రావడం వల్ల కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రాజెక్టులన్ని... నీటితో కళకళలాడుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గతంతో పోలిస్తేఈ ఏడాది గోదావరి,కృష్ణా నది పరివాాహక ప్రాంతాలలో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి వెంటనే యూరియా విడుదల చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. తెలంగాణ వాటా కింద ఆగస్టు నెలకు 1.40 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిన యూరియా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే కోటాలో ఉన్న దృష్ట్యా... రాష్ట్రంలో కొరత ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. వెంటనే ఇతర రాష్ట్రాలకు కేటాయించిన యూరియా కోటా నుంచి రాష్ట్రానికి సరఫరా చేయాలని మంత్రి లేఖలో కోరారు.
యూరియా కేటాయించాలని కేంద్రానికి లేఖ
రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నది పరివాహ క ప్రాంతాలలో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటల సాగు పెరిగే అవకాశం ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు రాష్ట్రానికి వెంటనే యూరియా విడుదల చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు.
యూరియా కేటాయించాలని రాష్ట్రం కేంద్రానికి లేఖ