సెప్టెంబరు 7 నుంచి శాసనసభ సమావేశాలు - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు
18:51 August 17
సెప్టెంబరు 7 నుంచి శాసనసభ సమావేశాలు
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్లో పలువురు మంత్రులతో చర్చించిన సీఎం.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. 20 రోజులు అసెంబ్లీ నిర్వహించడం వల్ల.. సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉందన్న సీఎం.. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.