ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ నేతన్న ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ భగవాన్ లాల్‌ను కలిశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణలో బాధిత కుటుంబీకులు పలు సమస్యలు విన్నవించారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఐకాస చైర్మన్ సురేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేవని చెబుతున్న కేటీఆర్... మిగతా జిల్లాల్లో చేనేత ఆత్మహత్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
ప్రభుత్వానికి చేనేత ఆత్మహత్యలు కనిపించవా..?
హైద్రాబాద్ రవీంద్రభారతిలో జాతీయ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ జరిగింది. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు.
జాతీయ బిసి కమిషన్‌ను కలిసిన నేతన్నలు