ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో 24వ రోజు నిరసనలో భాగంగా... రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు.
3 రాజధానుల ప్రతిపాదనలను నిరసిస్తూ.... 24వ రోజు నిరసనలో భాగంగా.... అమరావతి ప్రాంత రైతులు పిలుపునిచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు.... రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఐకాస ర్యాలీకి పోలీసుల అనుమతి లేదని.... విజయవాడలో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమలులో ఉందని సీపీ ప్రకటించారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగేలా ర్యాలీలు, నిరసనలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా... రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 144 సెక్షన్, 30 యాక్టు అమల్లో ఉన్నందువల్ల... ఎవరూ బయటకు రావద్దని ప్రకటించారు. గ్రామాల ప్రధాన కూడళ్లలో.... ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడిలోనూ..... రైతులు బయటకు రాకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై... రైతులు మండిపడుతున్నారు. శాంతియుత నిరసన తెలపుతున్న తమను.... మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు చేపట్టే పాదయాత్రను అడ్డుకుని.... భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని మండిపడుతున్నారు.