నిర్మాణ సమయంలో ఇంటి ముందు ఇసుక, కంకర ఉంటే యజమానుల వద్ద నుంచి 25 వేల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారని... ఇంటి ముందు కంకర, ఇసుక వేయకుండా ఇళ్లెలా కడతారో మీరే వివరించాలంటూ మేయర్‌ను నిలదీశారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బల్డియా అప్పుల్లో ఉందని ప్రజల నుంచి జరిమానాల రూపంలో డబ్బులు వసూలు చేసి లాభాల్లోకి రావాలనుకుంటున్నారా... అని జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించారు.
'ఇంటి ముందు ఇసుకుంటే 25 వేలు జరిమానా వేస్తారా..'
ఇంటి ముందు ఇసుక, కంకర వేయకుండా ఇళ్లు ఎలా కడ్తారో తెలపాలంటూ మేయర్ బొంత రామ్మోహన్‌ను ప్రశ్నించారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
'ఇంటి ముందు ఇసుకుంటే 25 వేల జరిమానా'
రాష్ట్ర పరిస్థితి బాగా లేదని.. ప్రజల పరిస్థితి అసలే బాగాలేదని సుధీర్ రెడ్డి తెలిపారు. తక్షణమే ఈ జరిమానాను తీసేయాలని... ఇప్పటి వరకు డబ్బులు వసూలు చేసినవారికి అవి తిరిగిచ్చేయాలని కోరాారు. అలాగే ఎల్బీనగర్లో అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నారని... ఇప్పటికైనా వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:మహబూబాబాద్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన...