ఎల్బీనగర్ పైవంతెన ప్రారంభం
ఎల్బీనగర్ కూడలిలోని ఫ్లైఓవర్ ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఇతర మంత్రులు తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్‌ను ప్రారంభిచారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఎల్బీనగర్ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి ఫ్లైఓవర్‌ను ప్రారంభిచారు. ఎస్ఆర్డీపీ నిధుల్లో భాగంగా రూ. 42కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భాగ్యనగరానికి ఎల్బీనగర్ ప్రధానద్వారం కావడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవ్వాల్సి వచ్చేదని, ఇప్పడది తీరిపోయిందని మంత్రి తలసాని అన్నారు.
భాగ్యనగరం దేశానికే ఆదర్శం
నగరాభివృద్ధికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశేషంగా కృషిచేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెరాస ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. భాగ్యనగరం దేశానికే తలమానికంగా మారనుందని తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.