భాజపా సభ్యత్వ నమోదుతో తెరాస నేతల ఆందోళనకు గురవుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్రం జల పథకం తీసుకువచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని తప్పుబట్టారు. గుజరాత్‌లో హర్ ఘర్ జల్ పథకాన్ని కాపీ కొట్టి తెరాస ప్రభుత్వం మిషన్ భగీరథను తీసుకొచ్చిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని తెరాస ఏ రోజూ కేంద్రాన్ని కోరలేదని వెల్లడించారు. జాతీయ హోదా వస్తే కమిషన్‌లు దండుకోడానికి అవకాశం ఉండదని విమర్శించారు.
మిషన్ భగీరథ... హర్ ఘర్ జల్‌కు కాపీ: లక్ష్మణ్ - TRS
''కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ విమర్శలు సరికాదు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కలుపుకుని రాష్ట్రానికి 68 శాతం కేంద్ర నిధులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఎందుకు అమలు చేయడం లేదు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం'': లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మిషన్ భగీరథ... హర్ ఘర్ జల్‌కు కాపీ: లక్ష్మణ్