వామన్రావు, నాగమణి దంపతుల హత్యకు నిరసనగా కూకట్పల్లి కోర్టులోనూ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అఖిల్ ఆధ్వర్యంలో కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై మానవహారం చేపట్టారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందుతులకు సహకరించిన వారిని సైతం శిక్షించాలన్నారు. సుప్రీం కోర్టు ఫాస్టాగ్ కేసుకింద తీసుకొని నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరారు. సీబీఐ విచారణ చేపట్టాలని... సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
'న్యాయవాదుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలి' - తెలంగాణ వార్తలు
పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల హత్యను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఆందోళన కొనసాగుతోంది. కూకట్‌పల్లిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
'న్యాయవాదుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలి'