కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... లాయర్స్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. భారత్ బంద్‌లో భాగంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమర వీరుల స్థూపం ముందు న్యాయవాదులు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గన్‌పార్క్ స్థూపం వద్ద లాయర్స్ ఆఫ్ తెలంగాణ ధర్నా - భారత్ బంద్ తాజా వార్తలు
భారత్ బంద్‌కు మద్దతుగా గన్‌పార్క్ అమర వీరుల స్థూపం వద్ద లాయర్స్ ఆఫ్ తెలంగాణ ధర్నా నిర్వహించింది. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేంత వరకు తమ మద్దతు ఉంటుందని న్యాయవాదులు స్పష్టం చేశారు.
గన్‌పార్క్ స్థూపం వద్ద లాయర్స్ ఆఫ్ తెలంగాణ ధర్నా
రైతులను బానిసలుగా చేసే నూతన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మూడు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు రైతులకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్