కథానాయిక లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సునిషిత్ అనే వ్యక్తి అసత్య ప్రచారం చేస్తున్నాడని తన అసిస్టెంట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడికి, తనకూ పెళ్లి జరిగిందంటూ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నాడని ఆమె పేర్కొంది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ స్పందించారు.
"యూట్యూబ్ ఛానెల్స్‌లో సునిషిత్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. సునిషిత్ ఇతర సెలబ్రిటీలపై కూడా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి మాత్రమే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాం." - కె.వి.ఎం. ప్రసాద్, సైబర్ క్రైమ్ ఏసీపీ