రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని... ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈ రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో ఉదయం సమయాల్లో తేలికపాటి పొగమంచు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం! - తెలంగాణ వార్తలు
తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీచే గాలుల వల్ల ఇవాళ, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం!
మధ్య పాకిస్థాన్ దాని పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందన్నారు. దీనికి అనుబంధంగా నైరుతి రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.
ఇదీ చదవండి:తల్లిదండ్రులూ పారాహుషార్... మత్తును వదిలించాల్సింది మీరే!