తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కాలనీల ముంపునకు ఆక్రమణలే కారణమట! - లాలాపేటలో వరదలు

నాలాలు కబ్జా చేయడం వల్లే నగరం వరద ముంపునకు గురైందని లాలాపేట నగర వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాదారులపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా... పట్టించుకోలేదని వాపోయారు.

lalapet colony people facing problems on floods
ఆక్రమణలే ముంపునకు ప్రధాన కారణం: లాలాపేట వాసులు

By

Published : Oct 21, 2020, 7:47 PM IST

చెరువులు, కుంటలను కబ్జా చేసి... ఇళ్లు నిర్మించుకోవటం, నాలాల ఆక్రమణే వరద ముంపునకు ప్రధాన కారణమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. తార్నాక డివిజన్ లాలాపేటలోని సత్యనగర్, సీబీఎన్ నగర్, కృష్ణానగర్ కాలనీ, మహేంద్ర హిల్స్ కాలనీల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఆక్రమణలే ముంపునకు ప్రధాన కారణం: లాలాపేట వాసులు

తమ ఇళ్లు, ఆస్తులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలాలు... ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా లేవని తెలిపారు. వాటిని వెడల్పు చేయటం, పూడిక తీయటం, సామర్థ్యం పెంపుతో పాటు.. నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం

ABOUT THE AUTHOR

...view details