తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు - లక్ష్మీపార్వతి

ఓ ప్రైవేటు ఛానల్​లో కోటి అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు లక్ష్మీపార్వతి. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష్మీ పార్వతి

By

Published : Apr 15, 2019, 4:37 PM IST

Updated : Apr 15, 2019, 5:29 PM IST

ఓ ప్రైవేటు ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి అనే వ్యక్తి తనపై దుష్ప్రచారం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీ పార్వతి రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్​ 4న జరిగిన ముఖాముఖిలో తనపై అసత్య ఆరోపణలు చేశాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఛానల్ యాజమాన్యం, యాంకర్​పైన కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీజీపీ సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్​ మహిళా శక్తి పేరుతో ఏ మహిళకు అన్యాయం జరిగినా తాను ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.

తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న లక్ష్మీ పార్వతి
Last Updated : Apr 15, 2019, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details