హైదరాబాద్ మలక్పేట ఏరియా ఆస్పత్రిలో తుమ్మలూర్ గ్రామానికి చెందిన విశాల (22) అనే గర్భిణీ ఆరో తేదీన కాన్పు గురించి చేరింది. గురువారం 11:30గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి డెలివరీ చేయగా.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే మలక్పేట వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యులు విశాలను చూసి అధిక రక్త స్రావం కావడం వల్ల అపస్మారక స్థితికి వెళ్లిందని సూచించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి! - malakpet area hospital
మలక్పేట ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యులపై మృతురాలి కుటుంబసభ్యులు అఫ్జల్గంజ్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి!
ఈ రోజు ఉదయం 9గంటల 30 నిమిషాలకు చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారని కుటుంబసభ్యులు తెలిపారు. తన భార్య చనిపోవడానికి మలక్పేట్ ఏరియా ఆసుపత్రి వైద్యులే కారణమని మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: చేపలు పడదామని వెళ్లాడు.. శవమై తేలాడు