రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లి పీఎస్ పరిధిలోని ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్న సూరజ్ అనే కార్మికుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. యజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికుడు మృతి చెందాడని బంధువులు ఆందోళన చేశారు.
విద్యుదాఘాతంతో కార్మికుని మృతి - Rangareddy District Mailardevpally Police station
విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు కాటేదాన్ పారిశ్రామికవాడలో ఓ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నాడు.
labour dead
యాజమాన్యం తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు సర్దిచెప్పారు. మృతుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి :'ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న మైనర్ల అరెస్ట్'