Metro opposes hike in electricity tariffs : విద్యుత్ ఛార్జీల పెంపును ఎల్అండ్టీ మెట్రో వ్యతిరేకిస్తోంది. తమ అభ్యంతరాలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి విన్నవించింది. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. హెచ్‌టీ వినియోగదారులకు ప్రతి యూనిట్‌పై రూపాయి పెంపును ప్రతిపాదించింది. దీనిపై ఇటీవల ఈఆర్‌సీ హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది.
మెట్రో వాదన ఇదే..
మెట్రోరైలు పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం కారణంగా యూనిట్ ఛార్జీని రూ.3.95 వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఛార్జీలు ప్రతి కేవీఏకి రూ.390 వసూలు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి యూనిట్ ఛార్జీ రూ.5.28 పడుతోందని ఎల్అండ్టీ మెట్రో అంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూపాయి పెంపుతో యూనిట్ ఛార్జీ రూ.4.95 అవుతుంది. డిమాండ్ ఛార్జీలు ప్రతి కేవీఏకి రూ.85 పెంపుతో రూ.475 అవుతుంది. ఈ ప్రకారం ప్రతి యూనిట్ ఛార్జీ రూ.6.57 అవుతుంది. యూనిట్‌కు రూ.1.29 పెరుగుతోంది. ఇది తమకు భారమని ఎల్అండ్టీ వాదిస్తోంది.