విపత్కర సమయంలో ఉన్నవారు లేనివారికి సాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి సూచించారు. క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందా పాండే అధ్వర్యంలో... హైదరాబాద్ అబిడ్స్ బొగ్గుల కుంటలోని ఎండోమెంట్ కార్యాలయంలో వందమంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
'నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి' - lock down update
హైదరాబాద్ అబిడ్స్ బొగ్గుల కుంటలో దివ్యాంగులకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చి వారి దాతృత్వాన్ని చాటుకోవాలని రమణాచారి కోరారు.
'నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలి'
రంజాన్ పర్వదినం రోజున దాతలు పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయమని రమణాచారి అభినందించారు. ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకొచ్చి దాతృత్వాన్ని చాటుకోవాలని రమణాచారి కోరారు.