హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతికశాఖ, దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జానపద కళాబ్రహ్మ సి.గోపాల్ రాజ్‌భట్ 91వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా కేవీ రమణాచారి పాల్గొన్నారు. రమణాచారితో పాటు తెలంగాణ సంగీత అకాడమీ ఛైర్మన్ శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
గోపాల్ రాజ్‌భట్ 91వ జయంతి - hyderabad
జాతీ ఉత్తమ అభిరుచులను కోల్పోతున్న పరిస్థితిలో మనం ఉన్నామని... పెద్దలను గౌరవించడం, సన్మానించడం ఇదే చివరి తరమని ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పిల్లల మాటలకు, తల్లులు చెప్పినట్లు నడుచుకుంటున్న తొలితరం కూడ ఇదే అని పేర్కొన్నారు.
జానపద కళాకారులు షెర్లీ పుష్యరాగం, దురిశెట్టి రామయ్య, మూర్తి జగన్నాథంను సి.గోపాల్‌రాజ్‌భట్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కారించారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, దివ్యాంగులకు ఇచ్చే ఫించన్లు పెంచినట్లుగానే, కళాకారులకు 3016 రూపాయాలు పింఛన్లు ఇవ్వాలని రమణాచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోపాల్‌రాజ్‌భట్ జయంతిని రాష్ట్ర జానపద దినోత్సవం నిర్వహించే విధంగా కృషి చేస్తామని తెలంగాణ సంగీతనాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు.
ఇదీ చూడండి : చాక్లెట్ చూపి.. బంగారం దోచే మహిళాదొంగ అరెస్ట్