KTR Tweeted to The Prime Minister: ఓబీసీకి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. వచ్చే బడ్జెట్ లోనైనా ఓబీసీలకు అధిక బడ్జెట్ కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. 2004లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ను కేసీఆర్ కలిసి ఓబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
అప్పుడు మన్మోహన్‌ను.. ఇప్పుడు మోదీని అడిగాం: కేటీఆర్ - కేటీఆర్ తాజా వార్తలు
KTR Tweeted to The Prime Minister: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓబీసీకి కేంద్రం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఈసారి బడ్జెట్లోనైనా కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు.
KTR Tweeted to The Prime Minister
ఓబీసీ సంఘాలను తీసుకెళ్లి అప్పటి ప్రధాని మన్మోహన్తో సమావేశమైన ఫొటోను కేటీఆర్ ట్విటర్లో పోస్టు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఓబీసీ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని, ఎన్డీఏ ప్రభుత్వమైనా ఓబీసీ శాఖను ఏర్పాటు చేసి, తగిన ప్రాధాన్యం ఇస్తుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి: