సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు భవనాలను ప్రారంభించారు. అనంతరం తంగళ్లపల్లి మండలంలో నిరుపేదలకు నిత్యావసరాలు, నగదు పంపిణీ చేశారు. అయితే... పర్యటనలో ఆయనకు ఫ్లూ లక్షణాలు కనిపించాయని... కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని ఓ వ్యక్తి మంత్రికి ట్వీట్ చేశారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి ప్రజలకు సూచనలిస్తూ.. కొవిడ్ కట్టడికి కేటీఆర్ యత్నించారని ఆయన పేర్కొన్నారు.
'నాకేమీ కాలేదు.. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి'
సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించినప్పుడు ఆయన జలుబుతో కాస్త ఇబ్బంది పడ్డారు. అతనికి ఫ్లూ లక్షణాలున్నాయని... ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించండి అంటూ ఓ వ్యక్తి కేటీఆర్కు ట్వీట్ చేశారు. తనకేమీ కాలేదని... జలుబు మాత్రమే చేసిందని.. మంత్రి ట్విటర్ ద్వారా తెలిపారు.
'నాకేమీ కాలేదు.. ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి'
దీనికి కేటీఆర్ స్పందిస్తూ... తాను బానే ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్లకు వెళ్లే దారిలో తనకు జలుబు చేసిందని.. అకస్మాత్తుగా పర్యటనను రద్దు చేసే ఉద్దేశం లేదని మంత్రి చెప్పారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే సిరిసిల్ల సందర్శనను నిలిపివేయలేదని పేర్కొన్నారు. తాను తెలీకుండా ఎవరికైనా అసౌకర్యం కలిగిస్తే క్షమించాలి అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండిఃహైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..
Last Updated : May 12, 2020, 2:29 PM IST