తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.50 లక్షలు విలువజేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నాం: మంత్రి కేటీఆర్‌ - రెండు పడక గదుల ఇళ్లు

Ktr Inauguration Double Bedroom: హైదరాబాద్​ ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఇందిరానగర్‌లో నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. మొత్తం 210 గృహాలను లబ్ధిదారులకు అందించనున్నారు.

Ktr Inauguration Double Bedroom
మంత్రి కేటీఆర్‌

By

Published : Feb 3, 2022, 9:46 AM IST

Updated : Feb 3, 2022, 11:24 AM IST

రెండుపడక గదుల ఇళ్లు ప్రారంభం

Ktr Inauguration Double Bedroom: హైదరాబాద్​ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని.... ఇందిరానగర్‌లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్.. ప్రారంభించారు. రూ.17.85 కోట్ల వ్యయంతో నిర్మించిన 210 ఇళ్లను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారుల గృహప్రవేశంలో పాల్గొని... వారికి శుభాకాంక్షలు తెలిపారు.

''ప్రధాన కూడళ్లలో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించాం. రూ.50 లక్షలు విలువజేసే ఇల్లు ఉచితంగా ఇస్తున్నాం. హైదరాబాద్‌లో రూ.9,714 కోట్లతో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. వారం రోజుల్లో కొల్లూరులోని ఇళ్లను సీఎం ప్రారంభిస్తారు‌. కొల్లూరులో ఒకేచోట 15,640 రెండుపడకగదుల ఇళ్ల నిర్మించాం. రూ.18 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్​దే.''

-కేటీఆర్, మంత్రి

ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను డిగ్నిటీ కాలనీలో... ఐదంతస్తుల్లో 5 బ్లాక్‌ల్లో నిర్మించారు. సీసీ రోడ్డు, తాగునీరు, 7 లిఫ్టులు, 7 షాపులు, డ్రైనేజీ కాలువ వంటి.... అన్ని మౌలిక వసతులను డిగ్నిటీ కాలనీలో కల్పించారు. ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం.. పచ్చని మొక్కలునాటి సుందరీకరణ పనులు చేపట్టారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Chalo Vijayawada: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం... ఉద్యోగ, ఉపాధ్యాయుల గృహనిర్బంధం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 3, 2022, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details