తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధానిలో కేటీఆర్..​ 13 రోడ్​షోలు, 26 సమావేశాలు - కేటీఆర్​ రోడ్​షోలు

పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​ బహిరంగ సభల్లో పాల్గొంటుండగా.. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ రోడ్​షోలు, సమావేశాలతో ప్రజలతో మమేకమవుతున్నారు.

కేటీఆర్​ రోడ్​షోలు

By

Published : Apr 3, 2019, 5:35 AM IST

Updated : Apr 3, 2019, 6:34 AM IST

13 రోడ్​షోలలో పాల్గొననున్న కేటీఆర్​
తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్​ సికింద్రాబాద్​, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో భారీ విజయాలే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన నియోజక వర్గాల్లో ప్రచారం రద్దు చేసుకుని రాజధానిలోనే ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. ఆయన పర్యటనల్లో మార్పులు చేశారు. బుధవారం నుంచి 8వ తేదీ వరకు నగరంలో 13 రోడ్​షోలను కేటీఆర్​ నిర్వహించనున్నారు. రోజుకు రెండేసి చొప్పున మొత్తం 26 సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అత్యంత కీలకం

నగరంలోని ఈ మూడు స్థానాలు అత్యంత కీలకమైనవిగా తెరాస నేతలు భావిస్తున్నారు. కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నందున వారి గెలుపు బాధ్యతను కేటీఆర్​ స్వీకరించారు. రోడ్​షోలకు బయలుదేరేముందు ఆయా నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులు, నేతలతో సమావేశమవుతారు.

ఇదీ చదవండి :ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్

Last Updated : Apr 3, 2019, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details