ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీ, రాహుల్ సహా ఎవరికీ భయపడను' - muncipality elections news

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే.. కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సవాల్ విసిరారు. తనకు భాజపా అంటే భయమన్న లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​లో తెరాస సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

ktr
తెరాస భవన్​లో సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్
author img

By

Published : Jan 13, 2020, 11:53 PM IST


కాంగ్రెస్ హయాంలో మున్సిపాల్టీలకు నిధులు ఎక్కువ విడుదల అయ్యాయంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. 2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కన్నా.. గత ఐదేళ్లలో రెట్టింపు నిధులను విడుదల చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

600కి పైగా స్థానాల్లో అభ్యర్థులే లేరు..

తనకు భాజపా అంటే భయమని లక్ష్మణ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 600కు పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలపలేకపోయినందుకు భయపడాలా లేక హుజూర్​నగర్​లో కారు గుర్తును పోలి ఉన్న స్వతంత్ర అభ్యర్థికి పోలైనన్ని ఓట్లు కూడా దక్కించుకోనందుకు ఆ పార్టీకి భయపడాలా అని ఎద్దేవా చేశారు.

ఎవరికీ భయపడను..

మోదీ, రాహుల్ సహా తాను ఎవరికీ భయపడనని... తన బాస్​లు దిల్లీలో లేరని.. తెలంగాణ గల్లీలో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మకర సంక్రాంతి ప్రతిపక్షాల భ్రాంతిని తొలగించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

తెరాస భవన్​లో సోషల్ మీడియా బృందాలతో కేటీఆర్

ఇవీ చూడండి: ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని సీఎంల నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details