తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో భాజపా సభ్యత్వాలు 12లక్షలే: కేటీఆర్ - trs

తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశమయ్యారు. సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్షించారు.

కేటీఆర్​

By

Published : Aug 22, 2019, 11:00 AM IST

Updated : Aug 22, 2019, 1:29 PM IST

రాష్ట్రంలో తెరాస కంటే బలమైన పార్టీ ఏదీ లేదని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. 60 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో భాజపాకు 12లక్షల సభ్యత్వాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. భారీగా సభ్యత్వ నమోదుకు కృషి చేసిన శ్రేణులందరికీ అభినందనలు తెలిపారు. ఈనెల చివరి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని సూచించారు. తెలంగాణ భవన్​లో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

ముఖ్యనేతలతో కేటీఆర్‌ సమావేశం

ఇవ్వాళ్టితో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని కేటీఆర్‌ చెప్పారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్, వర్ధన్నపేట ముందు నిలిచాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటివారం నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. దసరా పండుగకు పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని కేటీఆర్‌ అన్నారు.

ఇవీ చూడండి: గజ్వేల్​ హోటల్​లో కే'టీ'ఆర్​ బ్రేక్

Last Updated : Aug 22, 2019, 1:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details