KTR Invited To Borlaug Dialogue 2023 :ప్రపంచాన్ని ఆకలి కోరల నుంచి రక్షించి నూతన వంగడాల రూపకల్పనలో పరిశోధనలు చేసిన.. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న"బోర్లాగ్ ఇంటర్నేషనల్" సమావేశానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా.. ఈ ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర అనుభవాలను చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్‌స్టాడ్ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో ప్రసంగించాలని కోరారు.
Borlaug International Dialogue 2023 :అక్టోబరు 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయొవా రాష్ట్రంలోని.. డెమోయిన్ నగరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సంవత్సరం జరగనున్న సమావేశంలో "ట్రాన్స్‌ఫర్మేటివ్ సొల్యూషన్స్ టు అచీవ్ ఎ సస్టెయినబుల్, ఈక్విటబుల్ అండ్ నర్షింగ్ ఫుడ్ సిస్టమ్"’ అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు నేరుగా హాజరవుతారు. వేల మంది ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం అవుతారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యవసాయ రంగానికి, ఆహారభద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
France invites minister KTR: మంత్రి కేటీఆర్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం
Borlaug Dialogue 2023 in America :ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ సాధించిన వ్యవసాయ ప్రగతి, రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో చర్చించడం ద్వారా.. ప్రపంచ ఆహార కొరతను అధిగమించడం, ఆహార భద్రత, సరఫరాను పెంచడం, వంటి కీలకమైన అంశాలపై ఒక విస్తృత అవగాహన ఏర్పడుతుందని టెర్రీ బ్రాన్‌స్టాడ్ పేర్కొన్నారు. రాబోయే భవిష్యత్ తరాలకు వ్యవసాయరంగంలో వనరుల సద్వినియోగంపై ఈ సమావేశంలో చర్చా జరగనున్నట్లు తెలిపారు.