తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: 'పెట్టుబడులు పెట్టే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం' - కేటీఆర్ స్వీడన్ బృందంతో సమావేశం

KTR Met with Sweden Ambassador Team in HYD: హైదరాబాద్​లో స్వీడన్ రాయబారి బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 3, 2023, 9:04 PM IST

KTR Met with Sweden Ambassador Team in HYD: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ చేరుకున్న స్వీడన్‌ రాయబారి బృందంతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్‌తో చర్చించారు.

టెక్నాలజీ, తయారీ రంగాల్లో పెట్టుబడి పెట్టండి:తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వారికి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాల గురించి చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, దాని అనుబంధ తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. ఈ దిశగా భారత దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా చూపిస్తున్న కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించారు.

Provide suitable facilities for investment: భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని.. ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు.. పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందని జాన్‌ తెస్లెఫ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల పైన తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తుందని స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్​కు జాన్ తెస్లెఫ్ తెలిపారు. సమావేశం అనంతరం జ్ఞాపికలు ఇచ్చుకున్నారు.

"తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు స్వీడన్ కంపెనీలు ముందుకు రావాలని కోరుతున్నాం. మీకు రాష్ట్రంలో సరియైన అవకాశాలు కల్పిస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు రాష్ట్రం అత్యుత్తమ గమ్యస్థానం. మీకు కావల్సిన సహాయ సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది. టెక్నాలజీ, దాని అనుబంధ తయారీ రంగాల్లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. ఐటీ రంగంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతోంది. " -కేటీఆర్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details