కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కాళేశ్వరంను పూర్తిచేశారని అసెంబ్లీలో చెప్పారు. గత ప్రభుత్వాలు యాభై ఐదేళ్లలో కూడా చేయలేని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని... సినిమా ఇంకా ముందుందన్నారు కేటీఆర్. మూసీ సుందరీకరణ హామీకి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వేగవంతంగా అభివృద్ధి పనులు చేయడమే కాకుండా...మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్ - Assembly
గత ప్రభుత్వాలు యాభై ఐదేళ్లలో కూడా చేయలేని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందని మంత్రి కేటీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు.
Assembly