తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్‌షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 16 మంది ఎంపీలతో కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా తెరాస అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రధాని మోదీ దేశానికి చేసింది శూన్యమని విమర్శించారు. సికింద్రాబాద్ తెరాస పార్లమెంటు అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు.
తెలంగాణకు లాభం
బలహీన వర్గాల ముద్దుబిడ్డ సాయికిరణ్ యాదవ్‌ను ఆశీర్వదించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీకి, భాజపాకు ఓటేస్తే మోదీకి లాభమని.. కానీ తెరాసకు ఓటేస్తే తెలంగాణ మొత్తానికి లాభమని అన్నారు. ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధిని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
మన ఎంపీలతోనే మన రాజ్యం