తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 5:28 PM IST

ETV Bharat / state

గ్రేటర్​లో భాజపాని గెలిపిస్తే రూ. లక్ష కోట్ల ప్యాకేజి ఇస్తారా?

కొన్ని పార్టీలకి కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే మతాలు గుర్తొస్తాయని భాజపాని ఉద్దేశించి తెరాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ విమర్శలు చేశారు. గత ఆరేళ్లలో హైదరాబాద్​కు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. గ్రేటర్​ ఎన్నికల్లో భాగంగా జలవిహార్​లోని క్రిస్టియన్ల సభకు కేటీఆర్​ హాజరయ్యారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

ktr commented and criticized bjp
గ్రేటర్​లో భాజపాని గెలిపిస్తే రూ. లక్ష కోట్ల ప్యాకేజి ఇస్తారా?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే హైదరాబాద్​కు రూ. లక్ష కోట్ల ప్యాకేజీ ఇప్పిస్తామని ప్రధాని మోదీతో చెప్పించినట్లయితే... తాము కూడా అందరికీ మోదీ గొప్పతనం చెప్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని జలవిహార్​లో క్రిస్టియన్ల సభకు ఆయన హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ నిజమైన హిందువని, కాబట్టే ఆయన మిగతా మతాలను అగౌరవ పరచరని పేర్కొన్నారు. కానీ కొన్ని పార్టీలకు కేవలం ఎన్నికల సమయంలో మతం గుర్తొస్తుందని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు...

తాగి వాహనం నడపండి, తప్పుడు మార్గంలో వాహనం నడపండని కొన్ని పార్టీలు చెబుతున్నాయని కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్రం ఒక్క జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఐఐఎమ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లాంటి వాటిని ఎప్పటి నుంచో అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. నగరంలో బాబర్, బిన్ లాడెన్​ల గురించి మాట్లాడుతున్నారని, ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేరని సమాధానమిచ్చారు. విషయం లేని వాళ్లు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్​కు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:మూసీని గోదావరితో అనుసంధానించి ప్రక్షాళన చేస్తాం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details