తెలంగాణ

telangana

ETV Bharat / state

గచ్చిబౌలిలో ఐసోలేషన్​ వార్డులను పరిశీలించిన కేటీఆర్​ - isolation wards

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధిత రోగులకు అవసరమైన చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో 15 అంతస్తుల్లో నిర్మించిన స్పోర్ట్స్​ ఆథారిటీ భవనంలో ఐసోలేషన్​ వార్డుల ఏర్పాటును మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ పరిశీలించారు.

ktr and eetala The arrangement of the wards in gachibouli sports authority
గచ్చిబౌలిలో ఐసోలేషన్​ వార్డులను పరిశీలించిన కేటీఆర్​

By

Published : Apr 7, 2020, 4:15 PM IST

హైదరాబాద్​లోని​ గచ్చిబౌలిలో 15 అంతస్తుల్లో నిర్మించిన స్పోర్ట్స్​ ఆథారిటీ భవనంలో ఐసోలేషన్​ వార్డుల ఏర్పాటును మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ పరిశీలించారు. ఇక్కడ 1500 పడకల సామర్థ్యంతో వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గదికి రెండు పడకల చొప్పున ఏర్పాటు చేశారు. ఐసీయూతోపాటు జనరల్ వార్డ్స్​, ప్రత్యేక గదులను సిద్ధం చేస్తున్నారు.

కోవిడ్-19తో బాధపడే వ్యక్తులకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక వైద్యసదుపాయాలను కల్పిస్తున్నారు. వచ్చే వారంలోగా పనులన్నీ పూర్తి చేసి వార్డులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్​. మంత్రులతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు.

గచ్చిబౌలిలో ఐసోలేషన్​ వార్డులను పరిశీలించిన కేటీఆర్​

ఇది చూడండి:డ్రోన్​ వీడియో: హైదరాబాద్​ను ఇలా ఎప్పుడైనా చూశారా?

ABOUT THE AUTHOR

...view details