KTR Alerts on BRS Leaders Over Deep Fake Campaigning :డీప్ ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల ఇటీవల సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిలో చిక్కుకున్నట్లు కొంత మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఈ టెక్నాలజీ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ డీప్ ఫేక్‌ని ఎన్నికల ప్రచారంలో కూడా వాడుకుంటున్నారు. కొంతమంది దీన్ని వినియోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. నకిలీ వార్తలు సృష్టిస్తున్నాయని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Minister KTR Tweet Today :మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఐదు రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో రాజకీయ పార్టీలు జోష్ పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఓటర్లను మభ్యపెట్టే అవకాశం ఉందని.. పార్టీ శ్రేణులంతా అలర్ట్‌గా ఉండాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఏది ఫేక్? ఏది రియల్?- దేశవ్యాప్తంగా కొత్త దుమారం రేపుతోన్న డీప్‌ఫేక్ టెక్నాలజీ
KTR Fires on congress in Twitter : ఓటమి అంచున ఉన్న కాంగ్రెస్.. రాబోయే ఐదారు రోజుల్లో దుష్ప్రచారానికి దిగే ప్రమాదం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన ట్వీట్ చేశారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నకిలీ వీడియోలు సృష్టించి.. నకిలీ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిద్వారా ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్లు ప్రభావితంగా కాకుండా చైతన్యవంతులను చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అసలు డీప్ ఫేక్ అంటే ఏంటంటే.. ? :డీప్ ఫేక్ టెక్నాలజీ, కృత్రిమ మేధని ఉపయోగించి ఎవరిదైనా ఒక నకిలీ ఫొటోను తయారు చేస్తుంది. ఇందులో ఏదైనా ఫొటో, వీడియో, ఆడియోను నకిలీగా చూపించడానికి డీప్ లెర్నింగ్ అనే ఏఐని వాడతారు. దీనినే డీప్ ఫేక్ అంటారు. వాటిలో చాలావరకు పోర్న్, అశ్లీలమైన దృశ్యాలు ఉంటాయి. కానీ, డీప్ ఫేక్‌లలో మహిళలతో పాటు పురుషులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ఇలాంటి ఫేక్ మెటీరియల్‌ను పురుషులు నమ్మరు, పట్టించుకోరు.. అది వేరే విషయం అనుకోండి. అయితే డీప్ ఫేక్‌లను గుర్తించడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇవి చాలా కచ్చితంగా రియల్లాగే ఉంటాయి. ఏది నిజమైనది? ఏది నకిలీ అనే విషయం గుర్తించడం చాలా కష్టంతో కూడిన పని.
నేను రష్మిక అంత ఫేమస్ కాదు - డీప్ ఫేక్ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్
'డీప్‌ఫేక్ నియంత్రణ కోసం త్వరలోనే కొత్త వ్యవస్థ'- సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఐటీ మంత్రి భేటీ