తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ అంశాలపై ఈనెల 23న కేఆర్‌ఎంబీ కమిటీలు భేటీ - KRMB committee meeting on 23rd of this month

KRMB committees meeting ఈ నెల 23న కేఆర్‌ఎంబీ కమిటీలు సమావేశం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతో పాటు జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై భేటీ అవనున్నాయి.

KRMB committee meeting on 23rd of this month
ఆ అంశాలపై ఈనెల 23న కేఆర్‌ఎంబీ కమిటీ భేటీ

By

Published : Aug 19, 2022, 7:35 PM IST

KRMB committees meeting: తెలుగురాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలతో పాటు జల విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్, వరద జలాల అంశాలపై చర్చకు.... కేఆర్‌ఎంబీ కమిటీలు ఈ నెల 23న సమావేశం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ, ఏపీ అధికారులకు బోర్డు సమాచారమిచ్చింది. 2022-23 నీటి సంవత్సరంలో సాగు, తాగునీటి అవసరాల కోసం... నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది.

కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శితో పాటు.... రెండు రాష్ట్రాల ఈఎన్సీలు... త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి... ఓ నిర్ణయం తీసుకుంటారు. జల విద్యుదుత్పత్తి, ప్రాజెక్టుల రూల్ కర్వ్స్‌తో పాటు.... వరద నీటివినియోగం, సంబంధిత అంశాలపై చర్చకు... కేఆర్‌ఎంబీ , జలాశయాల పర్యవేక్షక కమిటీ అదే రోజు సమావేశం కానుంది. మూడు అంశాలపై సిఫారసులకు సంబంధించి రూపొందించిన నివేదికపై ఆర్‌ఎంసీ సమావేశంలో చర్చిస్తారు.

ABOUT THE AUTHOR

...view details