కృష్ణానది వరదలతో జలశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. వరద ప్రవాహం తగ్గినందున అధికారులు బ్యారేజి గేట్లు మూసివేస్తున్నారు. కృష్ణానదిపై జలాశయాల్లో నీటి నిల్వలు ఈ విధంగా ఉన్నాయి.
పులిచింతల
- పులిచింతల జలాశయం ఇన్‌ఫ్లో 23,931 క్యూసెక్కులు
- ఒక గేటు ద్వారా 11,376 క్యూసెక్కులు దిగువకు విడుదల
- పులిచింతల జలాశయం పూర్తి నీటిమట్టం 175 అడుగులు
- పులిచింతల జలాశయం ప్రస్తుత నీటిమట్టం 169.51 అడుగులు
- పులిచింతల జలాశయం పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలు
- పులిచింతల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 37.68 టీఎంసీలు
శ్రీశైలం
- నిండుకుండలా శ్రీశైలం జలాశయం
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- గరిష్ఠ నీటి సామర్థ్యానికి చేరువైన శ్రీశైలం జలాశయం
- శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.84 లక్షల క్యూసెక్కులు
- శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 1.67 లక్షల క్యూసెక్కులు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు
- శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 215.80 టీఎంసీలు
- కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,429 క్యూసెక్కులు విడుదల
- ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు విడుదల
- కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు విడుదల
- హంద్రీనీవాకు 1,688 క్యూసెక్కుల నీరు విడుదల
- పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 34 వేల క్యూసెక్కులు విడుదల
- 2 గేట్ల ద్వారా 56,150 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల