తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం - krishna river board meeting on the 9th of this month

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఈ నెల తొమ్మిదో తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధ వేదికగా బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో భేటీ జరగనుంది.

ఈ నెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం

By

Published : Aug 3, 2019, 5:54 AM IST

Updated : Aug 3, 2019, 7:54 AM IST

హైదారాబాద్​ జలసౌధలో ఈనెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం కానుంది. ప్రస్తుత ఏడాదికి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులతో పాటు ఇతర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుపై కూడా సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన టెలిమెట్రీ యంత్రాల పనితీరుతో పాటు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలపై చర్చించనున్నారు. చిన్ననీటి వనరుల లెక్కలు సహా ఇతర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లు, బోర్డు సభ్యకార్యదర్శి, సభ్యులు పాల్గొంటారు.

ఈ నెల తొమ్మిదిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశం
Last Updated : Aug 3, 2019, 7:54 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details