తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త సాగు చట్టాలతో ప్రమాదంలో వ్యవసాయం: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి - తెలంగాణ వార్తలు

దిల్లీలో కొనసాగుతున్న రైతు ఆందోళనలకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ నిర్వహించిన నిరాహర దీక్షలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఒక్క రోజు దీక్షలో కూర్చుకున్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

mlc narsireddy
mlc narsireddy

By

Published : Dec 22, 2020, 5:07 PM IST

Updated : Dec 22, 2020, 6:28 PM IST

కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలు వ్యవసాయ రంగాన్ని మరింత ప్రమాదంలో పడేశాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సాగు చట్టాలు రద్దు చేయాలని 27 రోజులుగా దిల్లీలో సాగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహర దీక్షకు ఆయన హాజరయ్యారు. ఒక్క రోజు దీక్షలో కూర్చుకున్నారు.

పెద్ద సంఖ్యలో విశ్రాంత ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరైన తమ మద్దతు ప్రకటించారు. కేంద్ర సాగు చట్టాలు ఉపయోగకరమే అయితే... రాష్ట్రంలో సన్న ధాన్యం పండించిన రైతులు మార్కెట్‌లో కనీస మద్దతు ధరలకు అమ్ముకోవడానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో కేంద్ర పెద్దలు చెప్పాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి, రైతు సంఘం నేత గోవర్ధన్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి :వ్యవసాయం వృత్తి కాదు.. ఒక జీవన విధానం: చుక్కా రామయ్య

Last Updated : Dec 22, 2020, 6:28 PM IST

ABOUT THE AUTHOR

...view details