తెలంగాణ

telangana

ETV Bharat / state

Koosukuntla Sworn in as MLA : ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం - మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Koosukuntla Sworn in as MLA : మునుగోడు ఉపఎన్నికలో తెరాస తరఫున ఘన విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఛాంబర్‌లో కూసుకుంట్లతో ప్రమాణం చేయించారు.

Koosukuntla Sworn in as MLA
Koosukuntla Sworn in as MLA

By

Published : Nov 10, 2022, 11:32 AM IST

Updated : Nov 10, 2022, 11:39 AM IST

Koosukuntla Sworn in as MLA : మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కూసుకుంట్లతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కూసుకుంట్లకు మంత్రులు, స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు.

మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక తప్పనిసరైంది. ఆ తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడులో పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నించాయి. ఎట్టకేలకు గులాబీ బాస్ వ్యూహం ఫలించి మునుగోడులో విజయం సాధించింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

Last Updated : Nov 10, 2022, 11:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details