ల్యాంకో గ్రూపునకు చెందిన మరో విద్యుత్ కంపెనీ కూడా దివాలా బాటలోకి చేరింది. ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్‌ను దివాలాకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించకపోవడం వల్ల యాక్సిస్ బ్యాంకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. బ్యాంకుల నుంచి కాలపరిమితి రుణాల కింద విడతల వారీగా రుణాలు పొందిన ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ 2018 ఆగస్టు 31 నాటికి రూ. 657.41 కోట్లు బకాయి పడింది. వాదనలు విన్న ట్రిబ్యుునల్ బ్యాంకు వాదనతో ఏకీభవిస్తూ దివాళ ప్రక్రియకు అనుమతించింది.
దివాలా బాటలో ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ - ల్యాంకో గ్రూపు విద్యుత్ కంపెనీ దివాళా
యాక్సిస్ బ్యాంకు నుంచి తీసుకున్న కాలపరిమితి రుణాలు సకాలంలో చెల్లించక పోవడం వల్ల ల్యాంకో గ్రూపునకు చెందిన విద్యుత్ కంపెనీని జాతీయ ట్రైబ్యునల్ దివాలాకు అనుమతిచ్చింది. ఆ సంస్థకు చెందిన కొండపల్లి పవర్ లిమిటెడ్ 2018 ఆగస్టు నాటికి రూ. 657 కోట్లు బకాయి పడింది.
దివాాలా ప్రక్రియ