ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల సామరస్య పూర్వక పరిష్కారం చూపాలని... ఇందులో రాజకీయాలు వద్దని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కార్మికులు ఆర్టీసీ విలీనం విషయంలో వెనక్కి తగ్గినందున ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై ప్రేమ చూపించి మిగతా డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్మికుల పట్ల కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవద్దని... వాళ్లు పిల్లలలాంటివాళ్లని పేర్కొన్నారు. కార్మికుల 26 డిమాండ్లలో చాలా వరకు అన్ని సహజమైనవేనని చెప్పారు. ఆర్టీసీ విషయంలో సీఎం ప్రణాళిక ఏమిటో ఎవరికి అర్థం కావడంలేదన్నారు.
'సామరస్య పూర్వక పరిష్కారం చూపండి'
ఆర్టీసీ డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించతగ్గవేనని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీటికి వెంటనే పరిష్కారం చూపాలని కోరారు.
సమ్మెకు పరిష్కారం చూపండి