ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను పరామర్శించడానికి కేసీఆర్‌కు తీరకలేదని... ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి రాష్ట్రపాలన మీద లేదని ఎద్దేవా చేశారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై గాంధీభవన్‌లో రెండో రోజు దీక్ష చేస్తున్న ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమ కుమార్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలు కలిసి సంఘీభావం తెలిపారు. ఇంటర్ పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్ ప్రధాన మంత్రి ఎలా అవుతారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.
'పరీక్షలే సక్రమంగా నిర్వహించలేదు.. ప్రధాని అవుతారా?' - KOMATIREDDY VENKAT REDDY
ఇంటర్ ఫలితాల అవకతవకలపై గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులు రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కుసుమకుమార్, పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
'పరీక్షలే సక్రమంగా నిర్వహించలేదు.. ప్రధాని అవుతారా?'
TAGGED:
KOMATIREDDY VENKAT REDDY