ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నం సబ్ జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. హత్యాయత్నం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న రవీంద్రతో పాటు మరో నలుగురు నిందితులను కూడా రాజమహేంద్రవరం జైలుకు పంపారు.
రాజమహేంద్రవరం జైలుకు కొల్లు రవీంద్ర తరలింపు - కొల్లు రవీంద్ర కేసు తాజా వార్తలు
వైకాపా నాయకుడు హత్య కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనతో పాటు మరో నలుగురు నిందితులనూ జైలుకు తీసుకెళ్లారు.
రాజమహేంద్రవరం జైలుకు కొల్లు రవీంద్ర తరలింపు
గత శుక్రవారం రాత్రి రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రవీంద్రను రాజమండ్రి జైలుకు తరలించేందుకు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఆయనతో పాటు ఈ కేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తీసుకెళ్లారు.