తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి: కోదండరాం - tsrtc

తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కూడా విజయవంతం అవుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సికింద్రాబాద్​లోని జేబీఎస్​లో కార్మికుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి: కోదండరాం

By

Published : Oct 16, 2019, 8:40 PM IST

రాష్ట్ర ప్రజలంతా ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉన్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్​ స్టేషన్​ వద్దకు వచ్చి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఆర్టీసీ మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులను, సంస్థను కాపాడుకోవడం కోసమే కార్మికులు సమ్మెబాట చేపట్టినట్లు తెలిపారు. హైకోర్టు చెప్పిన ప్రకారం ప్రభుత్వం యూనియన్లను చర్చలకు ఆహ్వానించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మె విజయవంతం అయినట్లుగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కూడా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details