తెలంగాణ

telangana

By

Published : May 28, 2021, 6:45 PM IST

ETV Bharat / state

Kodandaram: 'మిగతా మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు'

హైదరాబాద్​లో ఏ సంఘటనా జరిగినా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తే... మిగిలిన మంత్రులు ఎందుకని తెజస అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ తప్పితే మిగతా మంత్రులతో ఏ పని కాదని తేటతెల్లమైందన్నారు.

kodandaram-serious-on-ktr
Kodandaram: మిగతా మంత్రులు ఎందుకు? వాళ్లు జీతాలు తీసుకోవడం లేదా?

మున్సిపల్‌ వ్యవహారాలు చూడాల్సిన పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌ (KTR) హోం, వైద్య శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) మండిపడ్డారు. జోమాటో, స్వీగ్గి ఫుడ్‌ సరఫరా బాయ్స్‌కి అనుమతిపై హోంశాఖమంత్రి మహామూద్‌ అలీ పరిష్కారం చూపుతారనుకుంటే... మంత్రి కేటీఆర్‌ తలదూర్చారన్నారు. హైదరాబాద్‌లో ఏ సంఘటన జరిగినా కేటీఆర్‌ స్పందిస్తే మిగతా మంత్రులు ఎందుకు, వాళ్లు జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు.

మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ తప్పితే మిగతా మంత్రులతో ఏ పనికాదని తేటతెల్లమైందన్నారు. ఒక వ్యక్తి పాలన తప్పా మంత్రివర్గం ఏమీ లేదని విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అంటే కేసీఆర్‌, కేటీఆర్‌ చెప్పింది విని సంతకాలు చేసిరావాలి తప్పితే సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈటల రాజేందర్‌కు పట్టినగతే పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితులు రావడం వ్యవస్థలు కుప్పకూలిపోవడం శోచనీయమన్నారు.

మిగతా మంత్రులు ఎందుకు?

ఇదీ చూడండి:Revenge: తాను వివాహమాడాల్సిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..

ABOUT THE AUTHOR

...view details