తెలంగాణ

telangana

ETV Bharat / state

కోదండరాం గారూ.. నాకు సహకరించండి : మానవతారాయ్ - Telangana Jana Samithi Latest News

రానున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న తనను ఆశీర్వదించాలని తన గురువు కోదండరామ్​కు​ మానవతారాయ్ పాదాభివందనం చేశారు.

కోదండరాం గారూ.. నాకు సహకరించండి : మానవతారాయ్
కోదండరాం గారూ.. నాకు సహకరించండి : మానవతారాయ్

By

Published : Sep 5, 2020, 11:17 PM IST

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ జన్మదినం సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రొఫెసర్ గారూ !! సహకరించండి..

కాంగ్రెస్​‌లో రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ టికెట్ చేయిజారిన తనకు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​లో అవకాశం వచ్చేలా సహకరించాలని మానవతారాయ్ కోరారు. హైదరాబాద్ తార్నాకలోని కోదండరామ్ నివాసంలో ఓయూ జేఏసీ ఛైర్మన్ కొప్పుల ప్రతాప్ రెడ్డి, నిరుద్యోగ జేఏసీ అధికార ప్రతినిధి బండ మధు, ఓయూ జేఏసీ నాయకులు కార్తీక్, కిరణ్ తదితరులు తెజస అధినేతను కలిశారు.

కోదండరాం గారూ.. నాకు సహకరించండి : మానవతారాయ్

ఇవీ చూడండి : ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ద్వారా వైద్యం అందించాలి: టీఎన్జీవో

ABOUT THE AUTHOR

...view details