కరోనా వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం ఆరోపించారు. హైకోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించి చేతులు దులుపుకుందని విమర్శించారు. వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం: కోదండరాం - kodandaram latest news
తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా కట్టడిలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. కొవిడ్ మృతుల వాస్తవ లెక్కలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై మండిపడ్డ కోదండరాం
ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. వాస్తవ లెక్కలను బయటపెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరోనా కాటుకు బలైన పాత్రికేయులకు నివాళులర్పించారు. ఈ మూడేళ్ల పాటు అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించామన్న ఆయన.. భవిష్యత్‌లోనూ ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.